Sunday, November 9, 2025
Homenewsఆర్కే రోజా పై సీఐడీకి ఫిర్యాదు

ఆర్కే రోజా పై సీఐడీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్’ల పేరుతో రూ. 100 కోట్ల అక్రమాలు చేశారని అన్నారు. ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశామని తెలిపారు. శాప్ ఎండీలు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల డీఎస్‌డీఓలపై విచారణ జరపాలని కోరారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై విజయవాడలో జరిగిన సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS