అట్లాంటాలో జరిగిన మొదటి అధ్యక్ష చర్చలో తన వెనుకబడడంపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు. ఆ రోజు అనారోగ్యంతో ఉన్నానని, బాగా అలసిపోయానని తెలిపారు. ఆ రాత్రి తనకు అసహజంగా అనిపించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, తనను దేవుడు తప్ప మరెవరూ ఎన్నికల పోటీ నుంచి తప్పించలేరని, తన గెలుపు ఆపలేరని చెప్పారు. 81 ఏళ్ల జో బైడెన్ జూన్ 27న అట్లాంటాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు హాజరయ్యారు. ఈ చర్చలో ట్రంప్ పైచేయి సాధించారని, బైడెన్ ప్రభావం చూపలేకపోయారని డెమొక్రటిక్ పార్టీ నాయకులు విమర్శించారు. కొందరు ఆయనను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. దీనిపై బైడెన్ తాజా స్పందన ద్వారా ఎన్నికల పోటీ నుంచి తప్పుకోనని స్పష్టంగా తెలియజేశారు.