లోక్ సభ చివర దశ ఎన్నికల వేళ..బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్ 24 పరగణాల జిల్లాలోని కుల్తాలీలో కొందరు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి.. ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లను దగ్గర్లో ని నీటి కుంటలో పడేశారు.
దీంతోపాటు జాదవ్ పుర్ నియోజకవర్గం పరిధిలోని భాంగర్లో.. ఐఎస్ఎఫ్, సీపీఐ (ఎం) మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఏడో దశలో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ తోపాటు బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల కు పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఇక ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్లో ఒక్కొక్కటి చొప్పున అసెంబ్లీ స్థా నాలకు ఉపఎన్నిక జరుగుతోంది.