తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు దాడులు జరుపుతున్నారని ఆరోపించారు. పెర్ని నాని మాట్లాడుతూ, “ఇలా దాడులు చేస్తే ఏపీని మరో బిహార్‌గా మార్చొద్దు,” అని హెచ్చరించారు. “ఇలాగే దాడులకు తెగబడితే, తాము తిరబడాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్ద,” అని వార్నింగ్ ఇచ్చారు. “బోనులో పెడితే పిల్లి కూడా పులవుతుంది,” అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు.