ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా APCC చీఫ్ వైఎస్ షర్మిళ అభినందనలు తెలిపారు. ఆమె చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి ఓ సలహా ఇచ్చారు. “రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి ముఖ్య అంశాలను పూర్తి చేయాలి. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండాలి. ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీకి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగాలి. ప్రత్యేక హోదా కోసం కట్టుబడి, అన్ని విభజన హామీలను నిలబెట్టుకుని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి, ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది” అని తెలిపారు.