తెలంగాణ రాష్ట్రంలో మేకల పంపిణీ స్కీం లో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. ఈ స్కీం ద్వారా పేద గొర్రెల కాపరి కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2017లో ప్రారంభించిన ఈ పథకం, అవినీతి కారణంగా భారీగా దోచుకున్నట్లు ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) విచారణలో తేలింది
ACB విచారణలో అనేక దొంగ నంబర్లు, వాహనాలు మేకలను తరలించడానికి ఉపయోగించుకున్నట్లు బయటపడింది. ఖమ్మం జిల్లాలో ఒక అంబులెన్స్ ద్వారా 84 మేకలను తరలించారని, సంగారెడ్డి జిల్లాలో ఒక ద్విచక్రవాహనం పై 126 మేకలను తరలించారని, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక కారులో 168 మేకలను తరలించారని నమోదు చేశారు. నల్గొండ జిల్లాలో ఒక ఆటో ద్వారా 126 మేకలను తరలించినట్లు నమోదైంది. ఇటీవలే పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్రరను, ఓఎస్‌డీలను ACB అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అవినీతి మొత్తం ₹700 కోట్ల దాటుతుందని అనుమానిస్తున్నారు. ఈ అవినీతి వ్యవహారంలో ఉన్న అందరి వ్యక్తులను పట్టుకునేందుకు ACB దర్యాప్తు కొనసాగిస్తోంది. మరిన్ని అరెస్టులు, వివరాలు వెలుగులోకి రానున్నాయి.