By కరస్పాండెంట్ చీరాల ఇజ్రాయేల్
ఆలేరు, బొమ్మలరామారం. నవంబర్ 20 (వర్డ్ ఆఫ్ ఇండియా)
అడుగడుడున అయిలన్నకు ఆలేరు ప్రజల నీరాజనం,మోత్కుపల్లి మద్దతుతో ఓటర్లలో రెట్టింపయిన ఉత్సాహం
ప్రజల్లో విశ్వసనీయ నేతగా, ప్రజా సేవకుడిగా ఆలేరు నియోజకవర్గం లో ఎన్నో సేవలను అందిస్తూ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల భరిలోకి దిగిన బీర్ల అయిలయ్య ప్రచారం గ్రామాలలో పండుగ వాతావరణాన్ని కలుగజేయటమే కాకుండా గడప గడప తిరుగుతూ, అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొమ్మలరామారం మండలం లోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మద్దతుతో ఆలేరు నియోజకవర్గ ఓటర్లలో నూతన ఉత్సాహం నింపుతూ అయిలయ్య విజయ ఢంకా మోగించడం ఖాయమని ప్రజలు అభిప్రాయపడ్డారు.
వారు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ధృడ సంకల్పంతో బీర్ల ఫౌండేషన్ ను స్థాపించి, కరోనా కష్ట కాలంలో సహితము మారుమూల గ్రామాలలో, పల్లెల్లో ఆర్ధిక చేయూతనిస్తూ, నిత్యావసరాలను పేదలకు పంచి పెట్టి, గ్రామ గ్రామాన త్రాగు నీటి ఫిల్టర్లను ఏర్పాటు చేశారని ప్రజలు గుర్తుచేస్తున్నారన్నారు. అంతే కాక నిరుపేదల దాహార్తి తీరుస్తూ, చనిపోయిన భాదిత కుటుంబాల పక్షాన నేనున్నానని ధైర్యాన్నిస్తూ, ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణాలు చేపట్టి బీర్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవలకు గానూ ప్రజలు తనకు భ్రహ్మరథం పడుతున్నారన్నారు.
ప్రచారం లో భాగంగా బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతున్న అయిలయ్యకు వస్తున్న ప్రజాదరణ, యూత్ ఫాలోయింగ్ కి మద్దతుగా మీ వెంటే మేముంటాం అంటూ వృద్దులు సహితం ముందుకు నడుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తుందన్నారు. ప్రజల్లో బీర్ల అయిలయ్య పై ఉన్న నమ్మకం, ఆయన చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ అమలుచేయబోతున్నహామీలు, అధికారం లేని సామాన్య వ్యక్తి గా ఇన్ని సేవలు చేసిన వ్యక్తికి మనం అధికారం ఇస్తే ఎంత సేవ చేయగలడనేది ఈరోజే అర్థమౌతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా బీర్ల అయిలయ్య మోత్కుపల్లి లాంటి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, కుటుంబీకులతో నియోజకవర్గ ఓటర్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఊరూరా ప్రచారం చేస్తున్న బీర్ల అయిలయ్య గెలవడం ఖాయమని ప్రజలు ధీమావ్యక్తం చేశారు.