లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దేశంలో కొత్తగా ఎన్నికైన టాప్ 10 అత్యధిక ధనికుల్లో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ 3.3 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి, 5,700 కోట్ల ఆస్థులు ప్రకటించారు. తెలంగాణలో చేవెళ్ల నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి దేశంలో రెండవ ధనిక ఎంపీగా ఉన్నారు. ఈయన ఆస్థుల విలువ 4,568 కోట్లు. 1.5 లక్షల మెజార్టీతో గెలిచారు. హర్యానాలో కురుక్షేత్ర నుంచి ఎంపీగా గెలిచిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచి, 1,241 కోట్ల ఆస్థులు ప్రకటించారు. ఏపీకి చెందిన మరో అపర కోటీశ్వరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఈయన ఆస్థుల విలువ 716 కోట్లు. 2.3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మధ్యప్రదేశ్‌లో గుణ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 424 కోట్ల ఆస్థులతో, 5 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బాలీవుడ్ వెటరన్ నటి హేమ మాలిని మధుర లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీగా 2.8 లక్షల మెజార్టీతో గెలిచారు. ఆమె ఆస్థుల విలువ 278 కోట్లు.