దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మలయాళ చిత్ర పరిశ్రమను తెగ పొగిడేసారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రేమలు సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ రిలీజ్ చేసారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ అవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటచేసారు. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ పరిశ్రమ నుంచి బెస్ట్ నటులంతా మలయాళ ఇండస్ట్రీ నుంచే వస్తున్నందుకు తనకు కుళ్లుగా ఉందని తెలిపారు. …. రాజమౌళి ఏమన్నారంటే….ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూస్తేనే బాగుంటాయి. ఎందుకంటే మన పక్కన ఉన్నవారు నవ్వితే మనకూ నవ్వు వస్తుంది. తెలుగు డైలాగులు చాలా బాగా రాసారు. మలయాళం నుంచే బెస్ట్ నటులు వస్తున్నందుకు ఓ పక్క ఈర్ష్య మరో పక్క బాధ కలుగుతున్నాయి అని తెలిపారు.