Wednesday, April 16, 2025
Homenewsమోదీ మంత్రివర్గంలో తగ్గినా మహిళా మంత్రుల సంఖ్య

మోదీ మంత్రివర్గంలో తగ్గినా మహిళా మంత్రుల సంఖ్య

ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఈసారి మహిళా మంత్రుల సంఖ్య తగ్గింది. ఆదివారం ఎన్డీయే మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం ఏడుగురు మహిళలకు మంత్రి పదవులు లభించగా, వారిలో ఇద్దరికి కేబినెట్ హోదా దక్కింది. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండటం గమనార్హం. మంత్రి వర్గంలో చోటు దక్కని వారిలో స్మృతీ ఇరానీ, భారతీ పవార్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, దర్శనా జార్దోశ్, మీనాక్షీ లేఖీ, ప్రతిమా భౌమిక్ ఉన్నారు. మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరండల్జే, రక్షా ఖడ్సే, సావిత్రీ ఠాకూర్, నిమూబెన్ భంభానియా, అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఈసారి లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు.

 

రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది అతిథులు హాజరయ్యారు, ముఖ్యంగా భారత్ పొరుగున ఉన్న ఏడు దేశాల అధిపతులు కూడా వచ్చారు. మోదీ తన తొలి ప్రసంగంలో “పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యత” విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాంతంలోని దేశాలతో సన్నిహిత భాగస్వామ్యాలు కొనసాగిస్తామని, వారి గొంతును అంతర్జాతీయ వేదికపై వినిపిస్తామని వాగ్దానం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ ఆదివారం రాత్రి కొలువుదీరింది. మొత్తం 72 మందితో కేంద్ర మంత్రి మండలి ఏర్పడింది. 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆసక్తికరంగా, కేంద్ర కేబినెట్ హోదా దక్కించుకున్న మంత్రుల్లో ఆరుగురు న్యాయవాదులు, ముగ్గురు ఎంబీఏ డిగ్రీ పొందినవారు, పది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, పీయూష్ గోయల్ వంటి ప్రముఖులు కూడా ఈ కేబినెట్‌లో ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్ వంటి ప్రముఖులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే, మనోహర్ లాల్, హెచ్‌డీ కుమారస్వామిలతో సహా ఆరుగురు మంత్రులు పట్టభద్రులుగా ఉన్నారు.

 

భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో తన విధుల్ని మొదలుపెట్టిన ఆయన, ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS