తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విధివిధానాల ఖరారు పై చర్చలు జరుపుతోంది. ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, ఉద్యోగులను మినహాయించాలని సర్కారు యోచిస్తోంది. రుణమాఫీ భారం తగ్గించే మార్గాలపై, కొత్త ప్రతిపాదనలపై మంత్రిమండలి సమావేశంలో సమగ్ర చర్చలు జరుగుతున్నాయి. రుణమాఫీ కటాఫ్ తేదీగా 2018 డిసెంబరు 12 ను నిర్ణయించే అవకాశం ఉంది.

