Thursday, March 12, 2026
Homenewsలోకేశ్ సెటైర్లు - పరదాల వ్యవహారం

లోకేశ్ సెటైర్లు – పరదాల వ్యవహారం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుని ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. గెస్ట్ హౌజ్‌లో బస చేసిన మంత్రి లోకేశ్, పోలీసులు, అధికారులతో సరదాగా మాట్లాడారు. గెస్ట్ హౌజ్ ప్రాంతంలో పరదాలు కట్టడం గమనించిన లోకేశ్, “ఏంటి పరదాలు అంతటా?” అని ప్రశ్నించారు. పక్కవారు “అలవాటు పొరపాటు” అని చెప్పగా, లోకేశ్ సెటైర్లు వేస్తూ, “అన్ని డిపార్ట్‌మెంట్లకు క్లియర్‌గా అదేశాలు ఇచ్చినా, పరదాలు కట్టొద్దని చెప్పలేక చచ్చిపోతున్నాం” అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం జగన్ పర్యటన ఉంటే, అధికారులు పరదాలు కట్టేవారని, టీడీపీ నాయకులు సెటైర్లు వేసేవారని, జగన్‌ను పరదాల ముఖ్యమంత్రి అంటూ విమర్శించేవారని ఆయన చమత్కరించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS