జమ్మలమడుగులో ఎన్నికైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్‌లో ఉన్నారని, వారి భవిష్యత్ ఏంటో తెలియక సతమతమవుతున్నారు అని అన్నారు.ఆది నారాయణ రెడ్డి, “జగన్ తప్ప మిగతా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలంతా తమతో కలవాలని చూస్తున్నారు,” అని పేర్కొన్నారు. “తమను కేవలం పార్టీలో చేర్చుకుంటే చాలని, పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని రిక్వెస్ట్ చేస్తున్నారు,” అని ఆయన అన్నారు. ఇది నిజం అయితే, జగన్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయినట్లే అనుకోవాలి.