Saturday, December 21, 2024
Homenewsసమంతకు డాక్టర్‌ వార్నింగ్‌

సమంతకు డాక్టర్‌ వార్నింగ్‌

సమంతను జైల్లో పెట్టాలంటూ ఓ డాక్టర్ ఇచ్చిన వార్నింగ్‌ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. డాక్టర్‌ వార్నింగ్​ పోస్ట్‌పై సమంత స్పందిస్తూ, తాను తీసుకుంటున్న వైద్యం ఖరీదైనదని, అందరూ అలాంటి వైద్యం పొందలేరని తెలిపారు. అందుకే వైద్యుల సలహా మేరకు హెల్త్ టిప్స్‌ చెప్తున్నానని పేర్కొన్నారు. “ఏ విషయం గురించి తెలుసుకోకుండా మరొకరికి సలహాలు ఇవ్వను. నాకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్‌కు 25 ఏళ్ల అనుభవం ఉంది. నన్ను నిందించడం కన్నా నా డాక్టర్‌తో ముఖాముఖిలో పాల్గొనాల్సింది. ఆయన నా గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండితే గౌరవించేదాన్ని. నేను సెలబ్రిటీ కాబట్టి నిందించారు. ఏదేమైనా, నేను ఒక సామాన్య వ్యక్తిగా హెల్త్ టిప్స్ గురించి పోస్ట్ చేశాను,” అని సమంత రాసుకొచ్చింది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS