Sunday, December 22, 2024
Homenewsమహిళల హర్యానా జట్టుపై హైదరాబాద్ జట్టు ఘన విజయం

మహిళల హర్యానా జట్టుపై హైదరాబాద్ జట్టు ఘన విజయం

By

ఐశ్వర్యా రాజ్ 

 

నేడు కోల్‌కతా లోని  బర్సాత్ గ్రౌండ్  లో జరిగిన అండర్-23. T-20 మహిళల క్రికెట్ టోర్నమెంట్   లో హర్యానా టీమ్ హైదరాబాద్ టీమ్ లు తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ టాస్  గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల చేసింది . ప్రత్యర్ధి జట్టు హర్యానా ముందు 130 పరుగుల  లక్ష్యంని నిర్దేశించింది.

హైదరాబాద్ జట్టు లోని  క్రీడాకారిణి త్రిషాపూజిత  రాణించింది . బ్యాటింగ్ లో 50 బంతులో 52 పరుగులు చేసింది.  ఆనంతరం 131  పరుగుల లక్ష్యం తో  బాటింగ్ ప్రారంభీంచిన హర్యానా జట్టు  19.4 ఓవర్స్ లో 113 పరుగులకి అల్ అవుట్ అయింది . హైదరాబాద్ జట్టు 17 పరుగుల తేడా తో విజయం సాధించింది.

హైదరాబాద్ జట్టు లో క్రీడాకారిణి త్రిషాపూజిత బంతి తోను రాణించింది . 1.4 ఒవర్స్ లో బౌలింగ్ చేసిన త్రిష  2 వికెట్లు తీసింది . ఇటు బంతి తోను అటు బ్యాటు తోను రాణించిన త్రిషా పూజిత జట్టు విజయం లో తన వంతు కీలక పాత్ర పోషించింది .

కాగా  ఓవరాల్గా టోర్నమెంట్ లో త్రిషా పూజిత, హర్యానా  తో జరిగిన మ్యాచ్ లో 1.4 ఓవర్స కు 2 వికెట్లు, అరుణాచల్  ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఒవర్ల కు గానూ 4 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, ఒరిస్సా తోజరిగిన మాచ్ లో 2 ఓవర్స్ కు 4 పరుగులును ఇచ్చి 1 వికెట్, ముంబయి తో జరిగిన పోరులో త్రిషా పూజిత 1 ఓవర్ లో 1 పరుగు మాత్రమే  ఇచ్చి  1 వికెట్ తీసుకొని హైదరాబాద్ జట్టు సాధిస్తున్న విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న  హైదరాబాది  మహిళా క్రికెటర్ త్రిష పూజిత ను పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఊమెన్ క్రికెట్ అండర్-23. T-20 మహిళలా క్రికెట్ టోర్నమెంట్   లో హైదరాబాద్ టీమ్ చాలా సంవత్సరముల అనంతరం నాకౌట్ కి చేరుకుంది. డిసెంబర్ 25 నుండి 31 వరకు ఇండోర్ లో జరిగే నాకౌట్  మ్యాచ్ లలో  హైదరాబాద్ క్రికెట్ టీమ్ పాల్గొని తన సత్తా చాటనుంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS