Monday, December 23, 2024
Homenewsఅయోధ్య కి ఆదిపురుషుడి విరాళం 50 కోట్లా..?

అయోధ్య కి ఆదిపురుషుడి విరాళం 50 కోట్లా..?

By

ఐశ్వర్యా రాజ్

వందల సంవత్సరాలుగా మన హిందువులంతా ఎదురు చూస్తున్న అయోధ్య‌ రామ మందిర ప్రారంభానికి మ‌రో మూడు రోజుల స‌మ‌య‌మే ఉంది. మన దేశంలో ఎవ్వరిని పాలకరించినా ఇప్పుడు అయోధ్య‌ రామ మందిరమ్ గురించే ప్ర‌ధాన వార్త‌. ఏ టీవీ పెట్టినా, ఏ రెడియో ఆన్ చేసినా, ఏ పేప‌ర్లు చూసినా రామ మందిరానికి సంబంధించిన వార్తే ప్రధానంగా వినిపిస్తున్న‌ది, క‌నిపిస్తున్న‌ది. అఖ‌రుకు ప్రతి ఒక్క మోబైల్‌ ఫోన్ లోని గ్రూపుల్లో ప్ర‌తి నిమిషానికో న్యూస్ అయోధ్య రామ మందిరానికి సంభందించిందే అయి ఉంటుంది. ఆ దేశం నుంచి ఇంత విరాళం వస్తుంది , ఇన్ని కానుక‌లు వ‌స్తున్నాయ్‌, ఇక్క‌డి నుంచి ఇన్ని ల‌డ్డూలు వ‌స్తున్నాయి, వీటి ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా, అవి ఎక్క‌డ చేశారో తెలుసా.. అంటూ ఇబ్బ‌డిముబ్బ‌డిగా వార్త‌ల ప్ర‌వాహం కొన‌సాగుతుంది. ప్ర‌జ‌లు చూసి ఇత‌రుల‌కు షేర్ చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి మ‌రో ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే మన ప్ర‌భాస్ అయోధ్య మందిర ప్రారంభోత్సవ భోజ‌న ఖ‌ర్చుల గురించి. జ‌న‌వ‌రి 22న‌ అయోధ్య‌లో రామ మందిరం ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది హిందువులు ఇప్ప‌టికే అయోధ్య‌కు వెళ్తుండగా బాల రాముడి విగ్ర‌హ ప్రాణ‌ప్ర‌తిష్ట నాటికి భ‌క్తులు ల‌క్ష‌ల్లో రానున్నారు. ఈ సంద‌ర్బంగా అక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల భోజ‌నాల కోసం సినీ న‌టుడు ప్ర‌భాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చాడ‌ని, దాదాపు 300కు పైగా ప్ర‌దేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారంటూ ప్ర‌చార వార్త జ‌రుగుతుంది. తాజాగా కోన‌సీమ జిల్లా కొత్త‌పేట‌ ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి కూడా ఈ మాట ప్ర‌స్తావించ‌డంతో ఈ అంశం మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది.

చాలా మంది ఈ విష‌యాన్ని త‌మ వాట్స‌ప్‌ల‌లో, ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లోనూ షేర్ చేస్తున్నారు. కొంద‌రు ఈ విష‌యం ఫేక్ అని, కొంత మంది అదే నిజ‌మ‌ని, మ‌రి కొంత‌మంది ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ద‌మో తెలియ‌క‌ అయోమ‌యంలో పడి పడిపోతున్నారు. అయితే ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో జాతీయ మీడియా ప్ర‌భాస్ స‌న్నిహితుల‌తో ఈ విషయం గురించి మాట్లాడ‌గా ఈ వార్త‌ల‌న్నీఫేక్‌, రూమ‌ర్స్ అని ఇలాంటి వార్త‌ల‌ను ప్రసారం చేయోద్ద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో ప్రభాస్ పెద‌నాన్న కృష్ణంరాజు మ‌ర‌ణించిన స‌మ‌యంలో ప్ర‌భాస్ త‌మ స్వ‌గ్రామం అయిన మొగ‌ల్తూరులో అన్న‌దానం చేయ‌గా దాదాపు 10 ల‌క్ష‌ల‌కు పైగానే అభిమానులు, ప్ర‌జ‌లు హాజరయ్యారు. అదేవిధంగా ప్ర‌భాస్‌తో సినిమాల‌లో న‌టించే ప్ర‌తి యాక్ట‌ర్‌కని త‌న ఇంటి నుంచి భోజ‌నాలు పంపిస్తాడ‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి క్ర‌మంలోనే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సంద‌ర్భంగా అ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని కొంత‌మంది అభిమానులు ప్ర‌భాస్ ఇత‌రుల‌పై చూపించే అప్యాయ‌త‌ను అయోధ్య‌కు అన్వ‌యిస్తూ ప్ర‌భాస్ అన్న‌దానం చేస్తున్నాడ‌ని అందుకే 50 కోట్ల విరాళం ఇచ్చాడ‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS