Monday, December 23, 2024
Homenewsకొత్త ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ దొరికింది: బండి సంజయ్

కొత్త ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ దొరికింది: బండి సంజయ్

అధికారులను స్వేచ్ఛగా పనిచేయనీయండి.. లేకుంటే సర్కార్‍‌కు తిప్పలు తప్పవు: బండి సంజయ్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. చాలా మంది అధికారులు నిజాయితీగా పనిచేసే వాళ్లున్నారని, వారిని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా నిర్బంధాలు విధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈరోజు బండి సంజయ్ కరీంనగర్‌లో జరిగిన సామాజిక అధికార శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్రం ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేదని ఆవేదన చెందారు. మూడు సార్లు ఆయనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని అభిప్రాయపడ్డారు. నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.

గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో బెదిరింపుల వల్ల కేంద్రం దివ్యాంగులకు అందిస్తున్న ఉప కరణాలు పంపిణీని సక్రమంగా చేయలేదన్నారు.బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా పనిచేసి.. అవినీతికి పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే కొత్త ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS