ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్‌గా మారారు. చంద్రబాబు చలవతోనే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. కానీ, చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మాత్రం అడగటం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తారేమో అని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. “ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు మించిన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చాము,” అని చెప్తున్నారు. తీర్మానాలు చేసినంత మాత్రాన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలు రావని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. దాంతో, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవాల్సిందే అనే చర్చ మొదలైంది.

