Friday, November 22, 2024
Homenewsఆగం ఆగం అవుతున్న అంబటి రాయుడు..!

ఆగం ఆగం అవుతున్న అంబటి రాయుడు..!

By

ఐశ్వర్యా రాజ్

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన రాయుడు.. జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఈ సాయంత్రం సమావేశం అయినట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు.

క్రికెట్‌లో అంబటి ఆట అదుర్స్‌. అది టీమిండియాకు ఆడినా.. ఐపీఎల్‌లో ఆడినా.. తనదైన మార్క్ షాట్లతో చెలరేగి పోయేవాడు. ఇంకా బోల్డెంత క్రికెట్ కెరీర్ ఉన్నా.. అంతలోనే సడెన్‌గా క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాడు. అంతలోనే పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.  సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు అంబటి రాయుడు. గుంటూరు వైసీపీ ఎంపీగా బరిలోకి దిగుతాడని జోరుగా ప్రచారం నడిచింది. అంతలోనే ఏమైందో ఏమో.. పట్టుమని పదిరోజులు కూడా వైసీపీలో కొనసాగకుండానే ఆ పార్టీకి రాజీనామా చేశాడు.

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా తెలిపారు రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మరో ట్వీట్ చేశారు. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. త్వరలో దుబాయ్‌ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించాడు అంబటి. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటన చేసిన రెండ్రోజులకే జనసేన అధినేత పవన్‌తో భేటీ కావడం ఆసక్తి రేపింది. ఇది మర్యాదపూర్వక భేటీయా..? లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్నది  సస్పెన్స్‌ క్రియేట్ అవుతుండగానే.. కొంతమేర క్లారిటీ ఇచ్చాడు రాయుడు.

“నేను మంచి మనుసుతో ఏపీ ప్రజలకు సేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆకాంక్షలు నెరవేరతాయనే వైసీపీలో చేరాను. అందుకే చాలా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను విన్నాను. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో భాగం అయ్యాను. అయితే వైసీపీలో కొనసాగితే నా ఆశ నెరవేరదేమో అనిపించింది. ఇందులో ఎవర్నీ ఆక్షేపించడానికి లేదు. నా ఆలోచనా ధోరణి.. వైసీపీ భావజాలం విభిన్నంగా ఉంది. అంతేకానీ ఫలానా సీటు కోరడం, ఎలక్షన్స్‌లో పోటీ చేయడం వంటి అంశాల వల్ల నేను బయటకు రాలేదు. రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే అనుకున్నాను. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్ అన్నను కలవాలని నా మంచి కోరేవారు, మిత్రులు, కుటుంబ సభ్యులు సూచించారు. అందుకే కలిశాను. రాజకీయాలు సహా చాలా అంశాలపై చర్చించా. ఆయన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా. నా విజన్, ఆయన ఐడియాలజీ ఒకేలా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. క్రికెట్ కమిటిమెంట్స్ మేరకు దుబాయ్ వెళ్తున్నా. ఏపీ ప్రజల కోసం నిలబడటానికి నేను ఎప్పుడూ సిద్దమే” అని అంబటి రాయుడు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

ఇంటర్నేషనల్‌ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది.

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS