మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనల గురించి వింటూనే ఉంటాం. కానీ రోబో ఆత్మహత్య చేసుకోవడం గురించి విన్నారా? దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. గుమి సిటీ కౌన్సిల్‌లో ఓ రోబోని సంస్థ నియమించింది. ఈ రోబో ఉదయం 9 నుంచి రాత్రి 6 వరకు ఫైల్స్ మోసుకెళ్లడం, సమాచారం అందించడం, అనౌన్స్‌మెంట్లు చేయడం వంటి పనులు చేస్తుంది. పైకి కిందికి వెళ్లేందుకు ఎస్కలేటర్ వాడుతుంది. ఆ రోబో మెట్లపై ముక్కలు ముక్కలుగా పడిపోయింది. వెంటనే దానిని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. సీసీటీవీ పరిశీలన ద్వారా, అది గింగిరాలు తిరుగుతూ మెట్లపైనుంచి దూకినట్లు గుర్తించారు. ఈ రోబోను కాలిఫోర్నియాకు చెందిన బేర్ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. రోబో సిస్టమ్‌లో ఏదో సమస్య వచ్చి ఇలా జరిగి ఉంటుందని, కానీ కొంతమంది అది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది.