By కరస్పాండెంట్ చీరాల ఇజ్రాయేల్
ఆలేరు, బొమ్మలరామారం. నవంబర్ 30 (వర్డ్ ఆఫ్ ఇండియా):
ఓటేయటంలో యువతే దేశానికి దిక్సూచి.
అసెంబ్లీ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా బొమ్మలరామారం మండలంలోని తూముకుంట గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకొనుటకు మొత్తం 828 మంది ఓటర్లకు గాను 770 మంది ఓటర్లు ఓటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నవనిర్మాణ భారతాన్ని నిర్మించడంలో ఓటుహక్కు పాత్ర ఎంతో గననీయమైనదని, ప్రతి పౌరుడు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
పేద ప్రజల పట్ల ప్రతి గ్రామంలోని వెనుకబడిన అన్ని వర్గాల పేద ప్రజలకు విద్య, వైద్యం ఉద్యోగ కల్పన సృష్టించిన నాడే అన్ని గ్రామాలు ప్రగతి సాధించి అభివృద్ధి చెందుతాయన్నారు. ఇలాంటి సేవ చేసే నాయకున్ని ఎంపిక చేసే ప్రక్రియలో యువ ఓటర్లుగా మనందరి బాధ్యతే ఎంతో కీలకమని గ్రామంలోని యువత ఓటు హక్కు వినియోగించుకోవడంలో మా గ్రామం ముందున్నదని తెలిపారు.
కాగా మూడో తారీకు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాలలో పేదల పాలిట సేవ చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు కాబోతుందని, ఆలేరులో భారీ మెజారిటీతో బీర్ల ఐలయ్యనే గెలవడం ఖాయమని ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా గ్రామస్తులు నరేందర్ రెడ్డి, శ్రీశైలం, రాంరెడ్డి, అశోక్, ఇర్ఫాన్, యాదగిరి తదితరులు పాల్గొని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.