Friday, December 20, 2024
Homenewsకేసీఆర్‌కు సర్జరీ సక్సెస్.. కోలుకుంటోన్న మాజీ సీఎం.. వాకర్ సాయంతో నడిచిన నేత

కేసీఆర్‌కు సర్జరీ సక్సెస్.. కోలుకుంటోన్న మాజీ సీఎం.. వాకర్ సాయంతో నడిచిన నేత

కోలుకుంటోన్న కేసీఆర్.. వాకర్ సాయంతో నడిచిన మాజీ సీఎం

– BY చీరాల ఇజ్రేయేల్ యాదవ్

(వర్డ్ ఆఫ్ ఇండియా)

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు యశోదా వైద్యులు చేసిన తుంటి ఎముక మార్పిడి సర్జరీ సక్సె స్ అయింది. గాయ నుంచి క్రమంగా కేసీఆర్ కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయనను వైద్యులు రూముకు షిప్ట్ చేశారు. ఆ తర్వాత వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేశారు. వైద్యుల సలహా మేరకు కేసీఆర్ వాకర్ సహాయంతో నడిచారు. బీఆర్ఎస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని యశోద డాక్టర్లు ప్రకటించారు. ఆయన త్వరితగతిన కోలుకునేందుకు శరీరం సహకరిస్తోందని వెల్లడించారు. కేసీఆర్ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఆయనకు 6 నుంచి 8 వారాలపాటు విశ్రాంతి అవసరమన్నారు. కేసీఆర్‌కు ఇంకొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయనకు శ్వాస సంబంధిత శ్వాస సంబంధిత ఎక్సర్‌సైజులు చేయిస్తున్నామని.. త్వరలోనే కోలుకుంటారని యశోద డాక్టర్ ప్రవీణ్ వెల్లడించారు.

కాగా.. కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి బాత్రూమ్‌లో కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన సహా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎడమ తుంటి ఎముక విరిగినట్లు ప్రకటించార.అనంతరం సాయంత్రం ఆయనకు తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేశారు. ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలియడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS