Monday, December 23, 2024
Homenewsగ్రూప్‌ 2 అభ్యర్ధుల్లో గందరగోళం

గ్రూప్‌ 2 అభ్యర్ధుల్లో గందరగోళం

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ గ్రూప్‌ 2  పరీక్షలు ఈ సారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్‌ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్- 2 పరీక్ష మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది.

వాస్తవానికి ఈ ఏడాది నవంబర్‌ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీయస్సీ తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్‌ ప్రకటించింది

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS