BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్
సీఎల్పీ నేతగా ప్రకటించిన పార్టీ జనరల్ సెక్రటరీ కే సి వేణుగోపాల్
ఫలితాలు వెలువడిన రోజు నుండి సీఎం అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా ఉన్నప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించి సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగిందని సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 7న ఉంటుందని తెలిపారు.
మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మిగతా విషయాలు తర్వాత వెల్లడి పరుస్తామని మీడియాతో మాట్లాడారు. దీనిని బట్టి సీఎం రేవంత్ రెడ్డి అనే దానిపై స్పష్టత రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ అధిష్టానం యొక్క అధికారిక నిర్ణయం కొరకు అందరూ ఊహించిన విధంగానే తనని ఎంపిక చేయడంతో తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి.