Friday, December 20, 2024
Homenewsతెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

తెలంగాణ, హైదరాబాద్ డిసెంబర్ 7
(వర్డ్ ఆఫ్ ఇండియా)

హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.వారితోపాటు 11 మంది మంత్రులు ప్రమాణం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ చేతుల మీదుగా జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తో పాటు, ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క, మంత్రులుగా కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వంటి ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఈ వేడుకలో సుమారుగా 2000 పోలీసులు అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సహా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రమాణ స్వీకార అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకం మరియు దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా రెండో సంతకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకనుంచి మేము పాల కులం కాదు ప్రజాసేవకులం అన్నారు. ఈరోజు నుండి ప్రగతి భవన్ కాదు అని, అది జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పిలుచుకుందామని, అక్కడ రేపటి నుండే ప్రజాధర్భాను నిర్వహిస్తామని, ఇచ్చిన హామీల నెరవేర్పు దిశగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రిగా మొదటి ప్రసంగం చేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS