Sunday, December 22, 2024
Homenewsనీళ్ళు కాదు ప్లాస్టిక్ తాగుతున్నాం...!

నీళ్ళు కాదు ప్లాస్టిక్ తాగుతున్నాం…!

By

ఐశ్వర్యా రాజ్

నీళ్ళు కాదు ప్లాస్టిక్ తాగుతున్నాం…!

ఈ రోజుల్లో ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తాగడం చాలా సాధారణం అయిపోయింది. నల్లా నీళ్ళు తాగడమే మర్చిపోయాం. ప్లాస్టిక్ బాటిల్ లో తాగడం ఆరోగ్యానికి మంచిది అని భావిస్తున్నాం.

కానీ, మనం తాగేది నీళ్ళు కాదు అనే విషయం మీకు తెలుసా..!

సాధారణంగా ఒక లీటరు బాటిల్ నీళ్ళలో సగటున 2 లక్షల పైనే ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు తాజాగా ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఇంతకు ముందు వరకు వేసిన అంచనా కంటే ఇది 100 రేట్లు అధికం. మనుష్యుల ఆరోగ్యం పై ఇది తీవ్ర ప్రభావం చూపించే అంశం అని శాస్త్రవేత్తలు మనకు హెచ్చరిస్తున్నారు. ‘ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ‘ జర్నల్ లో ఈ పరిశోధన గురించిన వివరాలు తెలిసాయి.

దీని ప్రకారం.. శాస్త్రవేత్తలు అమెరికా లోని కొన్ని ప్రముఖ కంపెనీ లకు చెందిన నీళ్ళ బాటిల్లలో నానో ప్లాస్టిక్స్ అవశేషాలపై పరిశోధనలు జరిపారు. ఒక మైక్రోమీటర్ కన్నా తక్కువ పొడవున్న ప్లాస్టిక్ కణాలను నానో ప్లాస్టిక్ అని అంటారు. ఇవి మనిషి వెంట్రుక మందం లో 70 వ వంతు పొడవు గా ఉంటాయి. ఇవి అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన మనుష్యుల రక్తంలోకి మరియు ముఖ్యమైన అవయవల్లోకి చాలా సులభంగా ప్రవేశించ గలవు. గర్భంలోని శిశువులకు కూడా వీటి ద్వారా చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ నానో ప్లాస్టిక్స్ తల్లి పాల ద్వారా కూడా శిశువు శరీరం లోకి వెళ్లగలవు.

కాగా ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళల్లో నానో ప్లాస్టిక్స్ ఉంటాయని చాలాకాలంగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నా.. వాటిని ఖచ్ఛితంగా గుర్తించే టెక్నాలజీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపధ్యంలో అమెరికాలోని కొలంబియా విశ్వవిధ్యాయాలనికి చెందిన నైక్సిన్ క్వీయాన్ సారధ్యం లోని శాస్త్రవేత్తలు డేటా ఆధారిత అల్గరిథం ను ఉపయోగించి కొత్త మైక్రోస్కోప్ సాంకేతిక ను అభివృద్ది పరిచింది. దీనిని ద్వారా కొన్ని ప్రముఖ కంపెనీ ల నీళ్ళ బాటిల్ ల పై పరశోధన చేసిన తరువాత ఒక్కొక్క దానిలో 1,10,000 నుండి 3 ,70,000 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించేయని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది.

పలు రకాల అవశేషాలపై పరిశోధన

ప్లాస్టిక్ బాటిల్ లోని నీళ్ళలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నానో స్థాయి లో గుర్తించే విషయం లో ఇప్పటి వరకు ఉన్న పాత పరిశోధన స్థానం లో తమ కొత్త పరిశోధన భర్తీ చేసిందని నైక్సిన్ క్వీయాన్ బృందం తెలిపింది. పరిశోధనలో భాగంగా నైక్సిన్ క్వీయాన్ బృందం పాలీ ఎథిలీన్ టెరెప్తలేట్ (PET), పాలీ అమైడ్ లతో పాటు మొత్తం ఏడు రకాల ప్లాస్టిక్ అవశేషాలపై పరిశోధనలు చేపట్టింది. PET తో ప్లాస్టిక్ బాటిల్లను తయారు చేస్తారు. కాగా శుద్ది చేసే ఫిల్టర్ లో పాలీ అమైడ్ ఉంటుంది. అయితే, శాస్త్రవేత్తలు ఆ ఏడింటితో పాటు ఇంకా అనేక రకాల నానో ప్లాస్టిక్ రేణువుల్ని కూడా కనుగొన్నారు. 2022 లో జరిగిన ఒక పరిశోధన ద్వారా నల్లా కన్నా బాటిల్ నీళ్ళల్లో ప్లాస్టిక్ అవశేశాలు ఎక్కువ ఉన్నట్లు తేలింది. 2021 లో జరిగిన ఒక పరిశోధన ద్వారా మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది, అదేంటంటే బాటిల్ మూత తెరిచి మళ్ళీ మూత మూసిన ప్రతిసారీ ప్లాస్టిక్ రేణువులు నీళ్ళలో పడతాయని తెలిపింది.

కాబట్టి ఇక నుండైన జనాలు బ్రాండెడ్ నీళ్ళ బాటిల్ లోని తాగుతున్న ఒక సారి ఆలోచించాలి. నీళ్ళని కాచి వడాపోసి తాగలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS