Monday, December 23, 2024
Homenewsపవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసుల హెచ్చరిక

పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పిఠాపురం ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో వార్తల్లో నిలిచింది. ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు, తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసైనికులు వాహనాలపై స్టిక్కర్లు అంటించుకున్నారు.

 

అయితే, నంబర్ ప్లేట్లపై ఇలాంటి స్టిక్కర్లు తప్పని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల, ఒక స్కూటీ నంబర్ ప్లేట్‌పై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్ చూసిన పోలీసులు, ఆపి స్టిక్కర్ తొలగించమని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, తప్పులేని అభిమానాన్ని ప్రదర్శించాలన్నారని పోలీసులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, చెడ్డ పేరు తీసుకురావొద్దని సూచించారు. నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు పెట్టడం సరికాదని, చట్టాలను గౌరవించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS