Thursday, October 17, 2024
Homeతెలుగుతెలంగాణప్రమాణ స్వీకారోత్సవానికి అంతా రెడీ

ప్రమాణ స్వీకారోత్సవానికి అంతా రెడీ

 

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

తెలంగాణ, హైదరాబాద్. డిసెంబర్ 7 (వర్డ్ ఆఫ్ ఇండియా)

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్న అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారోత్సవ సభ మధ్యాహ్నం 1 గంటల 04 నిమిషాలకు ప్రారంభం కానున్నది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికనిస్తున్న ఎల్బీ స్టేడియం హంగులతో ముస్తాబయింది. సీఎంతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారందరికీ మాణిక్ రావు ఠాక్రే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది.

ఈ 11 మంది మంత్రుల జాబితా రాజ్ భవన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం నుండి తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు. వీరితోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కృతజ్ఞత సభ ఉండటంతో లక్షకు పైగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరవుతుండొచ్చనే అంచనాలకు తగ్గట్టుగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS