Wednesday, October 16, 2024
Homeతెలుగుమల్లారెడ్డి టీడీపీలో చేరతారా?

మల్లారెడ్డి టీడీపీలో చేరతారా?

తెలుగు దేశం పార్టీ రమ్మంటోంది… తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానంటున్నారు..? మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలు వద్దనడంతో తిరిగి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం, పవన్ కళ్యాణ్ మద్దతు, చంద్రబాబు నాయుడు అండతో తెలంగాణలో తన రాజకీయ పరిస్థితులను చక్కబెట్టుకోవాలని మల్లారెడ్డి భావిస్తున్నారు. టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి, 2014 లో మల్కాజ్‌గిరి ఎంపీగా విజయం సాధించారు. కానీ 2016 లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. 2018 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తన విద్యా సంస్థలు, అక్రమ నిర్మాణాలపై దాడుల కారణంగా టీడీపీలోకి తిరిగి వెళ్లాలని యోచిస్తున్నారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన మల్లారెడ్డి, సానుకూల స్పందన కోసం అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS