Thursday, March 12, 2026
Homenewsసర్కారు ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

సర్కారు ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు ఆఫీసుల్లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ముందుగా సచివాలయం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం. సీఎం, మంత్రులు, సీఎస్, సెక్రటరీల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరూ పంచింగ్ చేయడం తప్పనిసరిగా మారబోతుంది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా చేయాలని సీఎం యోచిస్తున్నారు. విమర్శలను సీరియస్‌గా తీసుకున్న సీఎం, సచివాలయంలో ముందుగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగులపై మానిటరింగ్ మెరుగవుతుందని, పని వేగం పెరగడం, ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయడం ద్వారా టీచర్లలో జవాబుదారీతనం పెరిగిందని, ఈ విధానం ఇతర శాఖల్లో కూడా పాజిటివ్ ఫలితాలు తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS