Thursday, October 17, 2024
Homeతెలుగుతెలంగాణకేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రికి తరలింపు

కేసీఆర్‌కు గాయం.. యశోద ఆస్పత్రికి తరలింపు

 

తెలంగాణ, హైదరాబాద్ డిసెంబర్ 8

(వర్డ్ ఆఫ్ ఇండియా)

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ నిన్న రాత్రి ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైదారాబాద్ లోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వైద్యులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించగా, ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే సర్జరీపై ఓ నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌లో ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన ప్రగతి భవన్‌ విడిచి వెళ్లినప్పటి నుంచి ఫాం హౌస్‌లోనే బస చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో కూడా నిన్నటి వరకు ఫాంహౌస్‌లోనే భేటీ అవుతూ గత రెండ్రోజులుగా స్వగ్రామం చింతమడకకు చెందిన ప్రజలను కూడా కేసీఆర్ అక్కడే కలస్తున్నారు.

కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురి అయ్యారని తెలియడంతో కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు నిన్న రాత్రే యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుతో టు ఇతర నాయకులు.. వైద్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS