కాంగ్రెస్ తాజాగా విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. తమకు కనీసం ఒక్క సీటైనా కేటాయించాలని కోరారు. ఐదు పార్లమెంట్ స్థానాల(CPI MP Seats)పై కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతిపాదన పెట్టామని ఆయన వెల్లడించారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటించాలని అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘ప్రతి ఎన్నికల ముందు ప్రధాని రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారు. ఆయన జాలి దయలేని రాజకీయ నాయకుడు. అధికారిక కార్యక్రమంలో రేపంత్ రెడ్డి ప్రధానిని పెద్దన్న అని కొనియాడితే.. మోడీ మాత్రం పార్టీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా లేదా ఎన్నికల ముందే చెప్పాలని’ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
అటు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కూనంనేని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం లో నీటి ఎద్దడి పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో కలవడం దురదృష్టకరమని చెప్పారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయకపోవడం మంచిదని కూనంనేని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన సీపీఐ అభ్యర్థిపైనే విజయం సాధించారని గుర్తుచేశారు. వయనాడ్ సీపీఐ సీట (CPI MP Seats)ని.. కాంగ్రెస్ ఈ అంశంలో మిత్రధర్మం పాటించాలని సాంబశివరావు సూచించారు.
అటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని కూనంనేని ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదికను నెలరోజుల్లో సమర్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక కార్యక్రమాల కోసం పర్యటిస్తున్నట్లు లేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ సభల్లో పాల్గొంటున్నారా అని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి పరిస్థితిపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి పరిష్కరించాలని సూచించారు.
READ LATEST TELUGU NEWS : వయనాడ్ నుంచే బరిలోకి దిగుతున్న రాహుల్ గాంధీ