Wednesday, October 16, 2024
HomeతెలుగుతెలంగాణElectric Buses: హైదరాబాద్‌లో మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు

Electric Buses: హైదరాబాద్‌లో మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్‌లో కొత్తగా మరో 22 ఎలక్ట్రికల్ బస్సులను (Electric Buses) టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

తెలంగాణలో తొలిసారిగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ నాన్‌ ఏసీ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

12 మీటర్ల పొడవుగల ఈ (Electric Buses)బస్సుల్లో 35 సీట్ల సామర్థ్యం ఉంది. ఈ బస్సుకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 225 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం ఉంది. 3 నుంచి 4 గంటల్లో ఫుల్‌ చార్జింగ్‌ అవుతుంది. బస్సుల్లో సెల్‌ ఫోన్‌ చార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది.

READ LATEST TELUGU NEWS: పదో తరగతి పరీక్ష హాలుకు ఎవ్వరూ సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS