అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఆ తర్వాత హీరోగా మారి.. తక్కువకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కింది స్థాయి నుంచి పైకి ఎదగడానికి నాని పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
తాను పదో తరగతిలో థర్డ్ క్లాస్‌లో పాసవుతానని అందరూ ఫుల్ క్లారిటీతో ఉన్నారని… ఆరోజు రిజల్ట్ వచ్చే రోజని… అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి న్యూస్ పేపర్లో రిజల్ట్స్ వచ్చేవని నాని(Natural Star Nani) చెప్పాడు.
తామంతా థర్డ్ క్లాస్ లిస్ట్ లోనే రిజల్ట్స్ వెతకడం ప్రారంభించామని అయితే, అక్కడ తన నెంబర్ కనిపించకపోవడంతో తాను ఫెయిల్ అయ్యానని అనుకున్నారని నాని తెలిపాడు.
కానీ, తన మీద ఎంతో నమ్మకం ఉన్న అమ్మ సెకండ్ క్లాస్‌లో చూద్దామని అక్కడ చూసినా తన నెంబర్ కనిపించలేదని, దీంతో వీడు ఫెయిల్ అయ్యాడని ఆమె కూడా ఫిక్స్ అయ్యారని నాని(Natural Star Nani)చెప్పాడు. ఫస్ట్ క్లాస్ వరసలో రిజల్ట్స్ వెతకలేదని తెలిపాడు.
కానీ.. అంతలోనే తన ఫ్రెండ్స్ వచ్చి నాని ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడని చెప్పడంతో… గబగబా వెళ్లి ఫస్ట్ క్లాస్‌లో వెతకడంతో తన రిజల్ట్ కనిపించిందని చెప్పాడు. పదో తరగతి తర్వాత ఏ ఎగ్జామ్ కూడా ఒకేసారి పాస్ అయింది లేదని సరదాగా తన జ్ఞాపకాలను పంచుకున్నాడు.
READ LATEST TELUGU NEWS: నెట్టింట వైరల్ అవుతున్న మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్