వైనాట్ 175 నినాదంతో ఏపీ ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఆ దిశగా పక్కా వ్యూహం(CM Jagan Strategy)తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన జగన్.. అభ్యర్థుల ఎంపికలోనూ తన మార్క్ చూపించారు.
200 సీట్లలో వందసీట్లను సీఎం జగన్ బీసీలకే కేటాయించారు. అలాగే సర్వేలు, కార్యకర్తల అభిప్రాయం, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఎంచుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో అవసరమైతే పేరున్న నేతలను పక్క నియోజకవర్గాలకు పంపించారు. అయితే జగన్ ఎంపిక చేసిన ఎమ్మెల్యేల జాబితా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి.
175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్.. అందులో టిప్పర్ డ్రైవర్, ఉపాధి కూలీ, రైతుకు చోటు కల్పించారు. వైసీపీ తరుఫున టిప్పర్ డ్రైవర్‌ను, రోజు కూలీని, రైతును బరిలో నిలబెట్టారు.
అనంతపురం జిల్లా మడశకిర అభ్యర్థిగా గతంలో ఉపాధి కూలీగా పనిచేసిన ఈర లక్కప్ప అనే వైసీపీ నేతను జగన్ బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి మరోసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన వైసీపీ అధిష్టానం.. ఈర లక్కప్పను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
మాదిగ సామాజికవర్గానికి చెందిన నేత అయిన ఈర లక్కప్ప.. గతంలో ఉపాధి కూలీగా పనిచేశారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా గృహంలో ఉంటున్నారు. గతంలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈర లక్కప్ప.. వైసీపీలో చేరి మండలస్థాయి నాయకుడిగా ఎదిగారు.
అయితే సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామికి అంత సానుకూలత వ్యక్తం కాకపోవటంతో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన మడకశిర నుంచి లక్కప్పను బరిలో దించారు. ఇక ఇదే అనంతపురం జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన శింగనమల అసెంబ్లీ స్థానం నుంచి కూడా.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి సీఎం జగన్ తన ప్రణాళికలో(CM Jagan Strategy) భాగంగా అవకాశం ఇచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ నిరాకరించిన వైసీపీ.. అమె స్థానంలో వీరాంజనేయులు అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. వీరాంజనేయులు తండ్రి కూడా గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. వైసీపీలో యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చిన వీరాంజనేయులు గతంలో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేశారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ సీటును సైతం వైసీపీ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తికి కేటాయించింది. రాజకీయాలపై ఆసక్తితో వైసీపీలోకి వచ్చిన తిరుపతి రావు.. 2021లో మైలవరం జెడ్పీటీసీగా గెలుపొందారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి చేరటంతో.. వైసీపీ ఈసారి తిరుపతిరావును మైలవరం బరిలో నిలిపింది. మరి జగన్ వ్యూహం ఏ మాత్రం ఫలిస్తుంది.. వీరి రాజకీయ భవితవ్యం ఏమిటనేదీ ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.
READ LATEST TELUGU NEWS: సీఎం జగన్‌కు భారీ ఓటమి.. ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్