Saturday, December 21, 2024
HomeSadhguru: సద్గురుకి బ్రెయిన్ సర్జరీ.. నెట్టింట్లో ట్రోలింగ్

Sadhguru: సద్గురుకి బ్రెయిన్ సర్జరీ.. నెట్టింట్లో ట్రోలింగ్

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక త‌త్వ‌వేత్త‌, ఇషా ఫౌండేష‌న్ సంస్థ అధినేత స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌(Sadhguru)కు బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. మార్చి 17న స‌ద్గురుకు విప‌రీత‌మైన త‌ల నొప్పి వ‌చ్చింది. దాంతో ఆయ‌న్ను ఢిల్లీలోని అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

అపోలో వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌గా.. స‌ద్గురు మెద‌డు వాచింద‌ని అందుకే ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ అయ్యింద‌ని తెలిపారు. వెంట‌నే స‌ర్జ‌రీ చేయ‌క‌పోతే ప్రాణానికే ప్ర‌మాదమని వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న స‌ద్గురు(Sadhguru)కు బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది.

ప్ర‌స్తుతం సద్గురు(Sadhguru) బాగానే కోలుకుంటున్నారు. అయితే ఇప్పుడు స‌ద్గురు త్వ‌ర‌గా కోలుకోవాలి అంటూ ఓ వైపు భక్తులు ప్రార్థనలు చేస్తుంటే. మరోవైపు ఆయ‌న‌పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. అలోప‌తి మెడిసిన్ అనేది కెమిక‌ల్ మాత్రమే అని ఏ చికిత్స‌కైన ఆయుర్వేద‌మే ఎంతో మంచిద‌ని ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ఆయుర్వేదమే మంచిదని నమ్మే సద్గురు.. ఎందుకు ఆయుర్వేదిక్ చికిత్స తీసుకోకుండా హాస్పిట‌ల్‌లో చేరారు అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. “ ఆయుర్వేదము గొప్పదే, అలోపతి గొప్పదే ”. కాకపోతే వ్యాపారాల కోసం మరొక దాన్ని తగ్గించి, సమస్య రాగానే ప్రజలకి చెప్పిన సొల్లంతా పక్కన పడేసి వెళ్లి హాస్పిటల్లో చేరుతారు చూడు అప్పుడు అనిపిస్తుంది, వీళ్లేమీ మహాత్ములు కాదు మీడియా, రాజకీయ అండతో ఎదిగిన స్వామీజీల ముసుగులో ఉన్న సాధారణ మనుషులే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

READ LATEST TELUGU NEWS: శివుడికి తులసీ, కుంకుమలతో పూజలు వద్దు.. ఏం చేయాలంటే?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS