Friday, December 20, 2024
HomeDelhi Liquor Scam: కేజ్రీవాల్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది?

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Delhi Liquor Scam)లో ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం ఈ కేసులోనే కీలక మలుపుగా మారింది.

ఈ ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ(Delhi Liquor Scam)కు రావాలని ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు జారీ చేసినా.. ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని.. గత కొన్ని రోజుల నుంచి ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు కూడా పేర్కొంటున్నారు.

అనుకున్నట్లు గానే గత గురువారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం రెండున్నర గంటల తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ భార్యకు సమాచారం అందించారు. అరెస్ట్ తర్వాత ఈ ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Scam) గురించి ఈడీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు.

ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో కేజ్రీవాల్‌ను కుట్రదారుగా ఈడీ అభివర్ణించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022ను రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేస్తోంది.

మద్యం పాలసీ విధానంలో మార్పులు చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని పేర్కొంది. వాటిని 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు.. మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ నోట్‌లో చేర్చారు.

ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరచూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ గురించి సీఎం కేజ్రీవాల్‌తో చర్చించినట్లు మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్లు ఈడీ ఆరోపణలు చేసింది.

ఇందులో భాగంగానే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు.. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు విజయ్ నాయర్‌ని పంపినట్లు తెలిసింది. సౌత్ లాబీలో గతంలో నిందితుడిగా ఉండి ఇప్పుడు అప్రూవర్‌గా మారిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్.. తన తండ్రితో కలిసి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్‌ని కలిసినట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది.

ఇక మరో ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాజీ సెక్రటరీ సీ.అరవింద్ ఈడీకి డిసెంబర్ 2022 లో ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మనీష్ సిసోడియా నుంచి మంత్రుల బృందం పంపిన నివేదికకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను తాను పొందినట్లు అరవింద్ తెలిపారు.

సిసోడియా ఫోన్ చేసి తనను సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లమని చెప్పారని సీ.అరవింద్ వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా అక్కడే ఉన్నారని.. అక్కడ తాను డాక్యుమెంట్ కూడా చూశానని చెప్పారు.

మంత్రుల బృందం సమావేశంలో సూచించిన ప్రతిపాదనలు ఆ డాక్యుమెంట్‌లో లేకపోవడంతో తాను ఆశ్చర్యపోయానని.. అయితే మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆ డాక్యుమెంట్ తయారు చేయమని కోరినట్లు సీ. అరవింద్ పేర్కొన్నారు.

READ LATEST TELUGU NEWS: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS