ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagendar) ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
ఈ అంశంపై దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఓటర్లకు డబ్బులు పంచారని .. ఈ విషయంలో దానం నాగేందర్(Danam Nagendar)పై కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.
READ LATEST TELUGU NEWS: సగం క్యాడర్ మీటింగ్‌కే రాలేదు: మల్లారెడ్డి