Friday, November 22, 2024
HomeAP Elections 2024: ఎన్నికల బరిలో మాజీ సీఎంల వారసులు!

AP Elections 2024: ఎన్నికల బరిలో మాజీ సీఎంల వారసులు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Elections 2024) దగ్గర పడుతున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎం తనయులు ఉన్నారు.

ఎన్టీఆర్ మూడుసార్లు, చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు చొప్పున ఉమ్మడి ఏపీ సీఎంలుగా పనిచేశారు. ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల బరి(AP Elections 2024)లో నిలుస్తున్నారు.

బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనబడుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచే అసెంబ్లీ బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణ చేతిలో ఆయన ఓడిపోయారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులైనటు వంటి సీఎం జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

READ LATEST TELUGU NEWS: ఎలక్షన్ కోడ్ సమయంలో సీఎం పవర్ ఎంత ?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS