ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకుంది. దీంతో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు కేజ్రివాల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సతీమణీ సునీత(Kejriwal Wife) సంచలన వీడియో రిలీజ్ చేశారు. తన భర్త లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వాస్తవాలను గురువారం కోర్టులో బయటపెడతారని దాని సారాంశం.
తన భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని ప్రకటించారు. ఆయన డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు.
కస్టడీలో కూడా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని.. అందుకే నీటి సమస్యను నివారించాలని రెండ్రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా చూస్తోందని సునీత(Kejriwal Wife) ఆరోపించారు.
ఆయనపై కేసులు బనాయిస్తోంది. ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరిణామాలతో తన భర్త కేజ్రీవాల్ ఆందోళనకు గురవుతున్నారని సునీత వాపోయారు.
Big Breaking ‼️
28 March को मुख्यमंत्री अरविंद केजरीवाल जी करेंगे बड़ा खुलासा‼️
तथाकथित शराब घोटाले का पैसा कहाँ है ?
अरविंद केजरीवाल जी ने कहा है कि वो पूरे देश के सामने 28 march को बतायेंगे कि तथाकथित शराब घोटाले का पैसा कहाँ हैं ?
-Smt @KejriwalSunita pic.twitter.com/6HSr2YxCwT
— AAP (@AamAadmiParty) March 27, 2024
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ 250 సార్లకు పైగా సోదాలు జరిపిందని సునీత వెల్లడించారు. అయినా వారికి ఏమి దొరకలేదన్నారు.
గురువారం కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు సునీత(Kejriwal Wife) తెలిపారు. ఆయన నిజమైన దేశభక్తుడని.. ధైర్యం గల నాయకుడని అన్నారు.
కేజ్రీవాల్‌ను తక్షణమే విడుదల చేయాలి.. కోర్టుకు విజ్ఞప్తి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను తక్షణమే విడుదల చేయాలని పిటిషనర్ తరుఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీని ముక్కలు చేసేందుకే ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని సీఎం తరుఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. పార్టీని రాజకీయంగా బలహీనపరిచేందుకే ఈడీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
ఎలాంటి విచారణ చేయకుండానే ఆయనను కస్టడీలోకి తీసుకుందని గుర్తుచేశారు. విచారణకు ఢిల్లీ సీఎం సహకరించడం లేదని ఈడీ చెప్తున్న మాటల్లో నిజం లేదని కొట్టిపారేశారు. మరోవైపు.. ఈ పిటిషన్‌పై స్పందించేందుకు తమకు ఇంకాస్త సమయం కావాలని ఈడీ కోర్టును కోరింది.
కోర్టుల్లో నిరసనలు చేస్తే ఊరుకోం: ఢిల్లీ హైకోర్టు
అటు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ సెల్ కోర్టు ప్రాంగణాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచింది. న్యాయస్థానాల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రగా ఉంటాయని హెచ్చరించింది.
కోర్టు కార్యకలాపాలకు అడ్డుపడకూడదని తెలిపింది. ధిక్కరిస్తే అది తీవ్ర చర్యగా పరిగణిస్తామంది. దీనిపై గురువారం విచారణ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
కాగా .. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆయన కస్టడీ మార్చి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం కోర్టులో హాజరుపరుచనున్నారు.
READ LATEST TELUGU NEWS: ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేసారు?