AP Mega DSC Notification: ప్రజలు జగన్ బెండ్ తీయడం ఖాయమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టాను… ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన ఏపీ ప్రభుత్వానిదని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్(AP Mega DSC Notification) వేస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేశారు.
పదవి ఉంటే ఒదిగి పనిచేసిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని చంద్రబాబు గుర్తు చేశారు. ‘ప్రజాగళం సభలు జనంతో కళకళలాడుతుంటే సిద్ధం సభలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు.
జగన్ ఓ విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడని చంద్రబాబు(Chandrababu Naidu) ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశామన్నారు.
తిరుపతి, చెన్నైలో విమానాశ్రయాలు ఉన్నాయని.. నెల్లూరులో కూడా ఓ విమానాశ్రయం నిర్మించాలని తాను భావించినట్లు తెలిపారు.
Read Also: ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ఆవిష్కరించిన షర్మిల
రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశామని.. తాము పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం కలిపి టెంపుల్ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని.. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై తమ పరిపాలనలో ఉక్కుపాదం మోపామని చంద్రబాబు అన్నారు.
స్మగ్లర్లకు వైసీపీ టికెట్లు ఇచ్చిందని చంద్రబాబు ఎత్తిపొడిచారు. టీడీపీ హయాంలో కోతలు లేని కరెంట్ ఇచ్చామని.. ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ మార్చడం జగన్ మార్క్ అంటూ విమర్శించారు.
Read Also: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?
తన సామాజిక వర్గానికే డబుల్ ప్రమోషన్ ఇవ్వడం ఆయన సీఎం జగన్ మార్క్ రాజకీయమన్నారు. ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక సరిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలని.. మద్య నిషేధం చేయాలని అన్నారు.
మద్యంపైనే రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారని.. తమ హయాంలో సంక్షేమానికి 19.5శాతం ఖర్చు చేశామని చంద్రబాబు(Chandrababu Naidu) అన్నారు. వైసీపీ హయాంలో సంక్షేమానికి 13.5 శాతం ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.