Konda Vishweshwar Reddy Campaign: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు కలిగిందని బీజేపీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Chevella BJP MP Candidate) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
Read Also: మూడోసారి మోడీనే ప్రధాని: కిషన్ రెడ్డి
Konda Vishweshwar Reddy praja ashirwad yatra is going under the watchful eye of the heavens where the sun is holding an umbrella, pulling out thorns and guarding the yatra like an eyelid where people are eagerly meeting, showing their enthusiasm and celebrating their happiness.… pic.twitter.com/AugUmrEwwv
— Konda Vishweshwar Reddy (Modi Ka Parivar) (@KVishReddy) April 1, 2024
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందడుగు వేస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy Campaign) విమర్శించారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానంలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
READ LATEST TELUGU NEWS: తెలంగాణలో రాజుకుంటున్న పొలిటికల్ హీట్