సాధారణంగా ఓటు అనేది ఒకసారే వినియోగించుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం రెండు సార్లు వినియోగించుకుంటారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలు రెండు సార్లు అందుకుంటారు. ఈ ప్రాంతం విశేషాలేంటో తెలుసుకుందాం.
ఆ ప్రాంతం పేరు కోటియా. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకు మధ్యలో ఉంది. ఇక్కడ నివసించేవారికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓటర్ ఐడీలతో పాటు ఒడిశా ఓటర్ ఐడీలు కూడా ఉంటాయి. ఓటర్ ఐడీలే కాదు రేషన్ కార్డులు, పెన్షన్ క ఆర్డులు కూడా రెండు రాష్ట్రాలకు చెందినవి ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను అందుకుంటున్నారు.
ఈ కోటియా ప్రాంతం రెండు లోక్ సభ నియోజకవర్గాల మధ్యలో ఉంది. ఒకటి అరకు మరొకటి ఓడిశాలోని కోరాపుట్. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు స్థానిక గ్రామాలను కూడా తమ భాషలో అర్థమయ్యేలా పలుకుతారు. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలా అని సతమతమవుతున్నారు. కొందరు ఓటర్లేమో ఏపీ ఎన్నికల్లో తాము ఓటేస్తామని.. ఇక్కడి రాష్ట్రం నుంచి పథకాలు ఎక్కువగా అందుతున్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోటియా ఓటర్లకు రూ.3000 పెన్షన్ వస్తుండగా.. ఒడిశా నుంచి కేవలం రూ.500 మాత్రమే వస్తోంది.