Monday, March 31, 2025
HomenewsAmit Shah Telangana Tour: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం: అమిత్ షా

Amit Shah Telangana Tour: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం: అమిత్ షా

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు అమిత్ షా తెలంగాణలో (Amit Shah Telangana Tour) పర్యటించారు.

సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ కమలం పార్టీని తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అవినీతి రహిత భారత్‌ నిర్మాణమే బీజేపీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ మూడూ అవినీతి పార్టీలేనన్నారు. మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పనిచేస్తాయని ఈ మీటింగ్‌ (Amit Shah Telangana Tour)లో స్పష్టం చేశారు.

READ LATEST MEWS TELUGU :  హైదరాబాద్‌లో మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS