Monday, December 23, 2024
HomeChandrababu: అమరావతిలో భూ కుంభకోణం.. చంద్రబాబుపై ఛార్జ్‌షీట్

Chandrababu: అమరావతిలో భూ కుంభకోణం.. చంద్రబాబుపై ఛార్జ్‌షీట్

అమరావతి అసైన్‌మెంట్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై నేడు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీఐడీ ఆరోపించింది.

ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను ప్రధాన నిందితుడిగా, మాజీ మంత్రి నారాయణ, సుధీర్ బాబు, అంజనీకుమార్‌లను ఇతర నిందితులుగా పేర్కొంది. రాజధాని నగర ప్లాన్ పేరిట చంద్రబాబు తదితరులు 1,100 ఎకరాల స్థలం కొట్టేశారని సీఐడీ అభియోగాలు మోపింది.

నిందితులు భూ రికార్డులను తారుమారు చేశారని ఛార్జ్‌షీట్‍‌లో సీఐడీ ఆరోపించింది. ఈ భూముల కేసు 2020లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, ఇతర మంత్రులు తమ బినామీల సాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన భూములు చేజిక్కించుకున్నారని సీఐడీ తెలిపింది.

అాలా భూములు తీసుకున్న అమరావతి రైతులకు ఎలాంటి ప్యాకేజీ చెల్లించలేదని, అతి తక్కువ ధరలకే ఆ భూములను లాగేసుకున్నారని పేర్కొంది. నిషిద్ధ జాబితాలో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, జీపీఏలు ఇచ్చేందుకు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చారని సీఐడీ అభియోగాలు మోపింది.

READ LATEST TELUGU NEWS: పొత్తుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు లాభమా… నష్టమా ?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS