Sunday, July 13, 2025
Homenewsపార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించిన బీజేపీ

పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులను ప్రకటించిన బీజేపీ

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా)

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణా పార్లమెంట్ స్థానాలలో బీజేపీ ఇంఛార్జుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నది. దీనిపై రాష్ట్ర బీజేపీ హై కమాండ్ ప్రణాళికలు రూపొందిస్తూ ఎవరిని ఇంఛార్జులుగా నియమించాలన్న దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా ఒక ఎమ్మెల్సీని ఇంఛార్జిగా నియమించింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇంఛార్జిగా పైడి రాకేశ్ రెడ్డికి, హైదరాబాద్ పార్ల మెంట్ స్థానానికి ఇంఛార్జిగా రాజా సింగ్ కి భాద్యతలప్పగించింది తెలంగాణా బీజేపీ అధిష్టానం. మొత్తం తెలంగాణ లోక్ సభ ఎన్నికల 17 స్థానాలలోని అన్ని స్థానాలకు ఇంఛార్జులను నియమించింది.

లోక్ సభ స్థానాల వారిగా ఇంఛార్జులు వీరే:

ఆదిలాబాద్ – పాయక్ శంకర్
పెద్దపల్లి – రమారావు పాటిల్
కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి
జహీరాబాద్ – కాటెపల్లి వెంకటరమణరెడ్డి
మెదక్ – పాల్వాయి హరీష్ బాబు
మల్కాజ్‌గిరి – పైడి రాకేష్ రెడ్డి
సికింద్రాబాద్ – కే.లక్ష్మణ్
హైదరాబాద్ – రాజా సింగ్
చేవెళ్ళ – ఏవీఎన్ రెడ్డి
మహబూబ్‌నగర్ – రామచంద్రరావు
నాగర్‌కర్నూల్ – మాగం రంగారెడ్డి
నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS