Monday, December 23, 2024
HomeAmitabh Bachchan: రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్!

Amitabh Bachchan: రామ్ చరణ్ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. కాగా ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ నటించనుంది అని రివీల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నటించబోతున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ను తీసుకున్నారని టాక్.. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి.

ఇక ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్‌గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్(Bobby Deol) కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందట. ఈ వార్త పై కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

READ LATEST TELUGU NEWS: నా పదో తరగతి రిజల్ట్స్ చూసి అంతా షాక్: నాని

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS