Wednesday, October 16, 2024
HomeతెలుగుతెలంగాణMLC Kavitha: జీవో నంబర్‌ 3ను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌

MLC Kavitha: జీవో నంబర్‌ 3ను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌

జీవో నంబర్ 3 ని వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనియ్యకుండా స్ట్రీట్ ఫైట్, లీగల్ ఫైట్ చేస్తామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హెచ్చరించారు. రోస్టర్ పాయింట్లో ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలో ఆమె మాట్లాడారు. 1996లో పీవీ నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్లు అందించారన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలని సూచించారు.

2022లో సుప్రీంకోర్టు జీవో3ను రద్దు చేసిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారన్నారు. ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చారని సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడాలని రేవంత్ కొట్లాడుతున్నారని, తన ఓటుకు నోటు కేసు పై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల సమస్యలపై లేకపోవడం దురదృష్టకరమని ఆమె దుయ్యబట్టారు.

జీవో నంబర్ 3ను రద్దుచేసి 33% రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆడపిల్లలు సీఎంను కలవాలని పోతే అపాయింట్మెంట్ కూడా కరువైందన్నారు. 90 రోజుల్లో ఒక్కనాడైనా ప్రజలను ముఖ్యమంత్రి కలవలేదని, ప్రజాపాలన అని మాటలకే పరిమితం చేసాడని ఆరోపించారు. రెండు రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ సోనియా దగ్గర హాజరు వేసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీపై ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

READ LATEST TELUGU NEWS : ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS