Sunday, March 23, 2025
HomeMLC Kavitha On Powercuts: కరెంట్ కోతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha On Powercuts: కరెంట్ కోతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

జగిత్యాలలో జరిగిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కరెంట్ లేకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha On Powercuts) ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరెంట్ రాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలుమార్లు ఫోన్ చేసిన వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆ ట్వీట్‌లో ‘అసెంబ్లీలో కరెంట్ కట్.. అధికారిక మీటింగ్ లో కరెంట్ కట్.. రైతులకు కరెంట్ కట్.. సీనియర్ అయిన జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy).. కాసేపు కరెంట్ లేకపోతేనే మీరు అల్లాడిపోతున్నారు.. మీరు స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాని పరిస్థితి!. మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కరెంట్ లేకపోతే, వారికి ఎంత దుఃఖం ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోంది. ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపై పెట్టమని సీనియర్‌‍గా మీరైనా ముఖ్యమంత్రికి చెప్పండి’ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha On Powercuts) దుయ్యబట్టారు.

READ LATEST TELUGU NEWS : బీఆర్ఎస్‌తో చేతులు కలిపిన బీఎస్పీ.. మాయవతి గ్రీన్ సిగ్నల్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS