Friday, February 28, 2025
HomeCONGRESS MP SEATS: కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ!.. హాట్ సీట్లు ఎవరికో?

CONGRESS MP SEATS: కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ!.. హాట్ సీట్లు ఎవరికో?

కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిన 13 ఎంపీ టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఇందులో నుంచి కేవలం నలుగురి పేర్లను మాత్రమే సీఈసీ ఫైనల్ చేసింది. మిగతా ఏడు సెగ్మెంట్లకు క్యాండిడేట్ల(CONGRESS MP SEATS)ను తేల్చలేదు.

వీటితో పాటు 13 లోక్ సభ స్థానాల్లో సునీల్ కనుగోలు టీం ఆధ్వర్యంలో ఫ్లాష్ సర్వే నిర్వహిచింది. ఇందుకు సంబంధించిన రిపోర్టు కూడా ఏఐసీసీకి చేరింది. అయితే దీనిపై మరోమారు స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోవాలన్న ఏఐసీసీ ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాసమున్షీ ఇవాళ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ వాళ్లు చెప్పిన పాయింట్స్ను నోట్ చేసుకుంటున్నారు. వాటిని హైకమాండ్‌కు పంపుతారని సమాచారం. ఆ తర్వాతే క్యాండిడేట్లు(CONGRESS MP SEATS) ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

READ LATEST TELUGU NEWS: కాపులంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి : కేఏ పాల్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS